నాలుగు రోజుల క్రిందట డిసెంబరు 28న సంస్కృత ప్రొఫెసర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత పియరీ సిల్వియన్ ఫిలియోజాట్ (89) ఈ లోకాన్ని విడిచివెళ్లారన్న వార్త అనుకోకుండా నిన్న నా కంటపడింది. ఆ బాధాకరమైన వార్తను చదువుతూ ఉండగానే వారి వాఙ్మయ స్వరూపం నా కందోయి ఎదుట కదలాడింది. శుభ్రమనస్కుడైన భాషాకుమారుడు ఆయన. గీర్వాణవాణి వాత్సల్యపూరితంగా తన హస్తాన్ని అగోచరంగా చాచి, విశ్వం మొత్తాన్నీ ఇప్పటికీ పొదువుకునే ఉందనే సత్యానికి సాక్షి ఆయన.